కరువుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరువుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)  విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదన్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి గోదావరిలో 750 టీఎంసీలను, కృష్ణాలో 250 టీఎంసీలను ప్రభుత్వం దిగువకు వదిలేసిందన్నారు. కన్నెపల్లి, దేవాదుల పంపులను సరిగ్గా వాడుకుని గోదావరిపై రిజర్వాయర్లు, చెరువులను నింపే అవకాశం ఉన్నా పట్టించుకోలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను ఆన్ చేయకుండా కృష్ణా నీటిని వృథా చేశారని మండిపడ్డారు.

ఎల్ నినో వస్తోందని మార్చి నుంచే వాతావరణ నిపుణులు హెచ్చరించినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగువకు నీటిని వదిలేయగానే ఏపీ ప్రభుత్వం ఒడిసిపట్టుకుందన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని, పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నీటిని ఏపీ సర్కార్ తరలించుకుపోయిందన్నారు. ఎక్కడో ఉన్న కుప్పం ప్రాంతానికి కూడా నీటిని పారించిందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>