Mobile Popup Ad
Mobile Popup Ad

కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ప్రెడిక్షన్.. ఎవరికి ఎంత అవకాశం?

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 19వ సీజన్‌లో నేడు అసలైన పోరుకు వేదిక సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, ఆదివారం తమ సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో బలమైన రాజస్థాన్ రాయల్స్‌ను (KKR vs RR ) ఢీకొట్టబోతోంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న కోల్‌కతాకు ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది. ఈ సీజన్‌లో కోల్‌కతా ప్రస్థానం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఆండ్రీ రస్సెల్ రిటైర్మెంట్, శ్రేయస్ అయ్యర్, క్వింటన్ డికాక్ వంటి కీలక ఆటగాళ్లు జట్టును వీడటంతో కేకేఆర్ ప్రస్తుతం పునర్నిర్మాణ దశలో ఉంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేక 10వ స్థానంలో నిలిచింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో 3వ స్థానంలో దూసుకుపోతోంది. అయితే గత మ్యాచ్‌లో ఎదురైన ఓటమి నుంచి తేరుకుని, మళ్లీ విజయాల బాట పట్టాలని ఆ జట్టు పట్టుదలతో ఉంది.

చరిత్రను పరిశీలిస్తే ఈ రెండు జట్ల మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన 32 మ్యాచుల్లో కోల్‌కతా 16 సార్లు గెలవగా, రాజస్థాన్ 14 సార్లు విజయం సాధించింది. మరో రెండు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. రికార్డుల పరంగా ఇరుజట్లు దాదాపు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. ఈడెన్ గార్డెన్స్ పిచ్ సాధారణంగా భారీ స్కోర్లకు అనుకూలిస్తుంది. చిన్న బౌండరీలు, మంచు ప్రభావం వల్ల ఇక్కడ ఛేజింగ్ చేసే జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండగా, కోల్‌కతా తన స్పిన్నర్లపై ఆశలు పెట్టుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>