ఖమ్మంలో బైక్ స్టంట్లు చేసిన యువకుడిపై కేసు

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలోని ఘట్టయ్య సెంటర్ వద్ద మితిమీరిన వేగంతో బైక్ స్టంట్లు (Bike Stunts) చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసిన వల్లూరు కృష్ణకిశోర్ రెడ్డిని టూ టౌన్ పోలీసులు (Khammam Police) శుక్రవారం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్, సీసీఎస్, ఎస్బీ పోలీసులు రాత్రివేళల్లో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.

బైక్ విన్యాసాలు చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, మోడిఫైడ్ సైలెన్సర్లు వాడటం, నంబర్ ప్లేట్లు లేకపోవడం, తల్వార్లతో రోడ్లపై పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఇన్స్పెక్టర్ రామకృష్ణ హెచ్చరించారు. మద్యం తాగి వాహనం నడిపితే సీజ్ చేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు.

తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు బైక్‌లు ఇవ్వకూడదని, లేదంటే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రతకు భంగం కలిగిస్తే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112 కు సమాచారం అందించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>