కేసముద్రం మార్కెట్‌లో ధాన్యానికి రికార్డు ధర!

కలం, మహబూబాబాద్‌: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో (Kesamudram Market) జేఎస్‌ఆర్‌ రకం పాత ధాన్యం ఆల్‌టైమ్‌ రికార్డు ధర పలికింది. శుక్రవారం క్వింటాల్‌కు ఏకంగా రూ.5,016 ధర నమోదైంది. మార్కెట్‌ గణాంకాల ప్రకారం.. అక్టోబర్‌ 23న జేఎస్‌ఆర్‌ రకం వడ్లకు గరిష్ఠ, కనిష్ఠ, మోడల్‌ ధర క్వింటాల్‌కు రూ.5,016గా నమోదైంది. అదే రోజు ఆర్‌ఎన్‌ఆర్‌ రకం వడ్లకు గరిష్ఠ ధర రూ.4,782, కనిష్ఠ ధర రూ.4,089, మోడల్‌ ధర రూ.4,279గా ఉంది. ఇతర పంటలతో పోలిస్తే జేఎస్‌ఆర్‌ రకం పాత ధాన్యం అత్యధిక ధర పలకడం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>