Mobile Popup Ad
Mobile Popup Ad

వృషకర్మతో చైతూకి కెరీర్ బెస్ట్ హిట్ ఇస్తా : కార్తీక్ దండు

కలం, సినిమా : యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ దండు(Karthik Dandu) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మిస్టిక్ థ్రిల్లర్ “వృషకర్మ”(Vrushakarma) .. సుకుమార్ రైటింగ్స్, SVCC బ్యానర్స్ పై తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు కార్తీక్ దండు ఈసారి మరో సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను పలుకరించనున్నాడు.

తాజాగా వృషకర్మ(Vrushakarma) ఫస్ట్ గ్లింప్స్‌ను  మేకర్స్ రిలీజ్ చేశారు. రెండు నిమిషాల నిడివితో సాగిన ఈ గ్లింప్స్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే బీజీఎం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించింది. ఇదిలా ఉంటే ఫస్ట్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు కార్తీక్ దండు (Karthik Dandu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వృషకర్మ అంటే సృష్టి ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన వాడని..  విష్ణు మూర్తి సహస్ర నామాలలో ఇదొక నామమని తెలిపారు. ఈ సినిమాలో సరికొత్త చైతూ కనిపిస్తాడు. ప్రతీ దర్శకుడికి తాను పని చేసే హీరోకి కెరీర్ బెస్ట్ మూవీ ఇవ్వాలనే కోరిక ఉంటుంది. ఈ సినిమాతో నాగ చైతన్యకు కెరీర్ బెస్ట్ మూవీ ఇస్తానని కార్తీక్ దండు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>