కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్(Karimnagar) పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Ghaus Alam) హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ప్రత్యేక నియమ నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సంబంధిత ఏసీపీల అనుమతి లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. కార్యక్రమాల నిర్వహణకు ముందుగా అధికారుల అనుమతి తప్పనిసరిగా పొందాలని సూచించారు. అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.
ఈ ఉత్తర్వులు అమలులో ఉన్న సమయంలో ఇతరులకు హాని కలిగించే వస్తువులు, మారణాయుధాలు ధరించి తిరగరాదని పేర్కొన్నారు. అలాగే రహదారులు, ప్రజా ప్రదేశాలలో జనాన్ని గుమికూడించడం నిషేధమని తెలిపారు. అనుమతి పత్రాలలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా మ్యూజిక్ సిస్టమ్‌లు, పాటలు, ప్రసంగాలు లేదా అధిక శబ్దాలు చేయరాదని సూచించారు. ఈ ఆంక్షలు ఈ నెల 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ గౌష్ ఆలం హెచ్చరించారు.

