Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రశాంతంగా బక్రీద్ పర్వదినం జరుపుకోవాలి: కరీంనగర్ కలెక్టర్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించుకునే బక్రీద్ పర్వదినాన్ని ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేలా సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. బక్రీద్ పండుగ ఏర్పాట్లపై సీపీ గౌష్ ఆలంతో పాటు మున్సిపల్, పోలీస్, పశుసంవర్ధక శాఖల అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష చేశారు. స్లాటర్ హౌస్‌ల వద్ద నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. స్లాటర్ హౌస్‌ల నుంచి వెలువడే వ్యర్థాలను నిబంధనల ప్రకారం సక్రమంగా డంపింగ్ యార్డులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆవులు, దూడల వధ పూర్తిగా నిషేధమని, చెక్‌పోస్టుల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహించాలన్నారు. సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. బక్రీద్ పర్వదినం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, డీపీవో జగదీశ్వర్, జిల్లా పశువైద్యాధికారి లింగారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత..

డ్రగ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. జిల్లా స్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. విద్యాసంస్థల్లో విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో డ్రగ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 11 కేసులు నమోదు చేశామని, 23 మందిని అరెస్టు చేశామని తెలిపారు. 2.763 కిలోల గంజాయి, నాలుగు గ్రాముల సింథటిక్ డ్రగ్, 8.2 గ్రాముల సింథటిక్ డ్రగ్ పట్టుకున్నామని పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 30 కేసులు నమోదు చేశామని 63 మందిని అరెస్టు చేశామన్నారు. దాదాపు 24 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 15 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. 123 మందిని బైండోవర్ చేశామని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>