Mobile Popup Ad
Mobile Popup Ad

శ్రీలంకలో గ్రాండ్ షెడ్యూల్‌కు సిద్ధమవుతున్న ‘డ్రాగన్’

కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR), స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డ్రాగన్'(Dragon). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవల ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రగ్గ్‌డ్ లుక్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ తన రెగ్యులర్ ఫార్మాట్‌లోనే మరింత భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ‘డ్రాగన్’ మూవీ యూనిట్ వచ్చే నెలలో శ్రీలంకలో మేజర్ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో చిన్న షెడ్యూల్‌ను పూర్తి చేసిన చిత్ర యూనిట్, తదుపరి దశ కోసం రెడీ అవుతోంది. ముఖ్యంగా శ్రీలంకలో ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్‌లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>