జోడేఘాట్‌లో కుమురం భీం వర్ధంతికి సన్నాహాలు

కలం, కెరమెరి :  కెరమెరి మండలం జోడేఘాట్‌లో(Jodeghat) ఈనెల 26న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న కుమురం భీం వర్ధంతి కార్యక్రమ ఏర్పాట్లను, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందుతో కలిసి ఆదివారం పరిశీలించారు. వర్ధంతి కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క హాజరుకానున్న నేపథ్యంలో సభా స్థలి ఏర్పాట్లతో పాటు కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఇతర ఏర్పాట్లను సమీక్షించారు.

వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ఆదివాసీల రాకపోకల సౌకర్యార్థం హట్టి గ్రామం నుంచి జోడేఘాట్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు నడవనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీటీడీఓ జాదవ్ అంబాజీ, కుమురం భీం సభ నిర్వహణ కమిటీ చైర్మన్ పెందోర్ రాజేశ్వర్, సర్పంచ్ ఆత్రం లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>