జనగామ ఏఎస్పీ బదిలీ

కలం, జనగామ: రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి విడుదల చేసిన ఐపిఎస్ బదిలీల జాబితాలో జనగామ ఏఎస్పీ (Jangaon ASP) పంధేరే చేతన్ నితిన్ (Pandhere Chetan Nitin) బదిలీ అయ్యారు. జనగామ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయనను జగిత్యాల జిల్లా అడిషనల్ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఖాళీగానే జనగామ స్థానం:

అయితే, తాజా బదిలీల ఉత్తర్వుల్లో పంధేరే చేతన్ నితిన్ స్థానంలో జనగామకు కొత్తగా ఏ అధికారిని ప్రభుత్వం నియమించలేదు. దీంతో జనగామ ఏఎస్పీ స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది. త్వరలోనే వెలువడే ఇతర బదిలీల జాబితాలో జనగామకు కొత్త అధికారిని కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>