అదరగొట్టిన ఎస్‌ఆర్‌హెచ్.. చతికిలబడిన చెన్నై

కలం, స్పోర్ట్స్ : ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నైతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ (SRH vs CSK)లో ఎస్‌ఆర్‌హెచ్ తన సత్తా చాటుకుంది. చెన్నైపై 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. తమ బ్యాటర్లు ఆపసోపాలు పడి చేసిన 194 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెన్నై బ్యాటర్లకు చుక్కలు చూపించారు ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచ్ (SRH vs CSK) కొనసాగింది. ప్రఫుల్ హింగే లాస్ట్ ఓవర్‌లో నోబాల్ వేయడంతో ఫ్యాన్స్ అంతా అవాక్కయ్యారు. ఇక మ్యాచ్‌ చెన్నైదే అనుకున్నారు. కానీ అద్భుతమైన బౌలింగ్, ఫీల్డింగ్ ఎస్ఆర్‌హెచ్ విజయం అందుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఛేజింగ్‌కు దిగిన చెన్నై 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను 10 పరుగుల తేడాతో ఓడించి ఎస్ఆర్‌హెచ్ ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్, యువ సంచలనం అభిషేక్ శర్మ (59) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరుపు ఆరంభాన్ని అందుకుంది. కేవలం 22 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డ అభిషేక్, పవర్ ప్లేలోనే స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు క్లాసెన్ (59) తనదైన శైలిలో క్లాస్ ఇన్నింగ్స్ ఆడి స్కోరును 194 పరుగులకు చేర్చాడు. మధ్యలో ట్రావిస్ హెడ్ (23) పర్వాలేదనిపించినా, కెప్టెన్ ఇషాన్ కిషన్ గోల్డెన్ డకౌట్ కావడం అభిమానులను నిరాశపరిచింది. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్ తలో మూడు వికెట్లతో రాణించడంతో ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.

అనంతరం 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు తమ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆది నుంచే ఒత్తిడిలోకి నెట్టారు. ఓపెనర్ ఆయుష్ మాత్రే (30) మెరుపులు మెరిపించినా, మిడిల్ ఆర్డర్‌లో మాథ్యూ షార్ట్ (34), సర్ఫరాజ్ ఖాన్ (25) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈషన్ మలింగ మూడు కీలక వికెట్లతో చెన్నై ఇన్నింగ్స్‌ను దెబ్బకొట్టగా, నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లతో అండగా నిలిచాడు. ఆఖరి ఓవర్లో ప్రఫుల్ హింగే నోబాల్ వేయడంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది, మ్యాచ్ చెన్నై వైపు మలుపు తిరుగుతుందా అనిపించింది. కానీ, ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొన్న హైదరాబాద్ ఫీల్డర్లు, బౌలర్లు చెన్నైని 184 పరుగులకే కట్టడి చేశారు. శివం దూబే (21), రుతురాజ్ గైక్వాడ్ (19) రాణించినా విజయతీరాలకు చేర్చలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయడంతో, హైదరాబాద్ 10 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>