వికారాబాద్ జిల్లాలో విషాదం.. ఆర్మీ జవాన్ బలవన్మరణం!

కలం, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్ గ్రామం (Lakshminarayanapur village) లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. దేశ సరిహద్దుల్లో సేవలందిస్తున్న ఒక ఆర్మీ జవాన్ తన సొంత గ్రామంలో బలవన్మరణానికి పాల్పడ్డారు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన బోయిని మల్లేశం భారత సైన్యంలో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల దసరా పండుగ సెలవుల నిమిత్తం ఆయన సొంతూరికి వచ్చారు. రోజంతా కుటుంబ సభ్యులతో గడిపిన మల్లేశం అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆయన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కాగా, మల్లేశానికి కేవలం ఆరు నెలల క్రితమే వివాహమైనట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జవాన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>