ఆసియన్ పారా గేమ్స్‌కు ప్రెమాకు నో ఛాన్స్?

కలం, స్పోర్ట్స్ : ఆసియన్ పారా గేమ్స్‌కు (Asian Para Games) తన ఎంట్రీ విషయంలో అన్యాయం జరిగిందని భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ప్రెమా విశ్వాస్(Prema Vishwas) ఆవేదన వ్యక్తం చేశారు. తన ఎంట్రీని తొలుత పంపకపోవడంతో పాటు, తర్వాత ఆలస్యంగా పంపడం వల్ల అది తిరస్కరణకు గురైందని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో ఆసియా ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో, మహిళల డబుల్స్‌లో టాప్-6లో ఉన్నప్పటికీ ఆసియన్ పారా గేమ్స్ జట్టులో తనకు చోటు దక్కలేదని ప్రెమా తెలిపారు. సింగిల్స్‌లో 11వ ర్యాంక్ వరకు ఉన్న క్రీడాకారుల ఎంట్రీలు పంపినప్పుడు.. తన ఎంట్రీ ఎందుకు పంపలేదని ఆమె ప్రశ్నించారు.తన ర్యాంక్‌కు అనుగుణంగా అవకాశం ఎందుకు దక్కలేదో స్పష్టత ఇవ్వాలని కోరిన ప్రెమా.. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను ఎలాంటి ప్రత్యేక సాయం లేదా మినహాయింపు కోరడం లేదని, న్యాయమైన అవకాశం మాత్రమే కోరుతున్నానని తెలిపారు.

తండ్రిని కోల్పోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ప్రెమా వెల్లడించారు. ప్రస్తుతం ఉద్యోగం లేదని, శాశ్వత స్పాన్సర్ కూడా లేరని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతరుల సహాయంతో శిక్షణ తీసుకుంటూ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. ఆసియన్ పారా గేమ్స్ తన కెరీర్‌లో ఎంతో కీలకమైన అవకాశమని ప్రెమా అన్నారు. మళ్లీ ఇదే స్థాయికి చేరుకునేందుకు అవసరమైన ఆర్థిక బలం తనకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిని పరిశీలించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తనకు ప్రత్యేక మినహాయింపు కాకుండా దేశం తరఫున ఆడేందుకు ఒక అవకాశం మాత్రమే కావాలని విజ్ఞప్తి చేశారు. ఇక 2025 ఈజిప్ట్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్‌లో ప్రెమా రెండు కాంస్య పతకాలు సాధించారు. ఈ టోర్నమెంట్ పారా ఆసియన్ గేమ్స్ ఎంపిక ర్యాంకింగ్స్‌లో భాగంగా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>