కలం, వెబ్ డెస్క్: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో (Commonwealth Games) భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. పారా అథ్లెట్ దిలీప్ మహద్ గవిత్ పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించారు. ఇదే విభాగంలో మరో అథ్లెట్ మహమ్మద్ బాసిల్ రజత పతకం గెల్చుకున్నారు. స్టార్ లాంగ్ జంపర్ మురళీ శ్రీ శంకర్ పురుషుల లాంగ్ జంప్ పోటీల్లో రజత పతకం సాధించారు.
పొలం నుంచి ట్రాక్ ఫీల్డ్‌లోకి..
బంగారు పతకం సాధించడంపై అథ్లెట్ దిలీప్ మహడ్ గవిత్ స్పందిస్తూ.. తాను చిన్న గ్రామం నుంచి వచ్చానని.. పొలం పనులు చేసుకునేవాడినని గుర్తు చేసుకున్నారు. ఒక రోజు కోచ్ గుర్తించి, తనను నాసిక్ తీసుకెళ్లి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారని వివరించారు. తనకు అన్నీ రకాలుగా కోచ్ సహకారం అందించారని.. ఆయన వలనే గోల్డ్ మెడల్ కొట్టినట్లు తెలిపారు. గురు పూర్ణిమ సందర్భంగా తన గురువుకు పతకం బహుమతిగా ఇస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు.

