Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రపంచ యోగాసనలో భారత్ జోరు.. మూడో రోజూ పతకాల వర్షం

కలం, స్పోర్ట్స్​ : అహ్మదాబాద్‌లో జరుగుతున్న తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్‌ (World Yogasana Championship) లో ఆతిథ్య భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మూడో రోజు పోటీల ముగిసే సమయానికి భారత్ 22 స్వర్ణాలు, 5 రజతాలు, 1 కాంస్య పతకంతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో నేపాల్, జపాన్, అమెరికా కూడా ఒక్కో స్వర్ణ పతకం సాధించి తమ ముద్ర వేశాయి. ఈ టోర్నీ యోగాసనను అంతర్జాతీయ క్రీడగా మరింత ముందుకు తీసుకెళ్లే కీలక వేదికగా నిలుస్తోంది. భారత్ 122 మంది క్రీడాకారులతో ఆరు వయసు విభాగాల్లో పోటీ పడుతోంది.

భారత్‌కు తొలి స్వర్ణం అందించిన రీతూ మండల్ మరోసారి మెరిసింది. ఆమె వ్యక్తిగత విభాగంలో గెలిచిన స్వర్ణానికి తోడు జట్టు విభాగంలోనూ మరో స్వర్ణం సాధించింది. మరోవైపు జపాన్‌కు మియోకో కుసునోకి, నేపాల్‌కు దుర్గా పంతా, అమెరికాకు కెమీ బ్లేక్ స్వర్ణ పతకాలు అందించారు. రీతూ మండల్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఒక స్వర్ణ పతకం సాధించడమే కలగా ఉండగా రెండు స్వర్ణాలు గెలవడం ఊహించలేదని పేర్కొంది. తన విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది.

మూడో రోజు ప్రధాన పతకాల విజేతలు

ట్రెడిషనల్ యోగాసన – సీనియర్ C మహిళలు

బంగారు పతకం మియోకో కుసునోకి (జపాన్)
సిల్వర్ మెడల్ మహువా మండల్ (ఒమన్)
కాపర్ మెడల్ అముతా రాజువెలూ (రోమేనియా)
కాపర్ మెడల్ టెట్యానా టోల్బటోవా (నెదర్లాండ్స్)

ఫార్వర్డ్ బెండ్ – సీనియర్ C పురుషులు

బంగారు పతకం దిలీప్ కుమార్ (భారత్)
సిల్వర్ మెడల్ రాజేంద్ర రిమాల్ (నేపాల్)
కాపర్ మెడల్ దిమిత్రి వోల్కోవ్ (రష్యా)
కాపర్ మెడల్ సజయ అట్టాడా (అమెరికా)

ఫార్వర్డ్ బెండ్ – సీనియర్ C మహిళలు

బంగారు పతకం దుర్గా పంతా (నేపాల్)
సిల్వర్ మెడల్ సుమన్ యాదవ్ (భారత్)
కాపర్ మెడల్ అముతా రాజువెలూ (రోమేనియా)
కాపర్ మెడల్ కామిని మగన్‌లాల్ (న్యూజిలాండ్)

బ్యాక్ బెండ్ – సీనియర్ C పురుషులు

బంగారు పతకం బిరేంద్ర యాదవ్ (భారత్)
సిల్వర్ మెడల్ రాజేంద్ర రిమాల్ (నేపాల్)
కాపర్ మెడల్ తకురో సాటో (జపాన్)

బ్యాక్ బెండ్ – సీనియర్ B పురుషులు

బంగారు పతకం కెమీ బ్లేక్ (అమెరికా)
సిల్వర్ మెడల్ టీనా ఖాతున్ (భారత్)
కాపర్ మెడల్ టామ్ హోయ్ చింగ్ (హాంకాంగ్)

బ్యాక్ బెండ్ – సీనియర్ C మహిళలు

బంగారు పతకం గాయత్రి దేవి (భారత్)
సిల్వర్ మెడల్ జనుకా ధుంగానా (నేపాల్)
కగిసో సెబటానా (బోట్స్వానా)

ట్విస్టింగ్ బాడీ – సీనియర్ A పురుషులు

అనురాగ్ మాలిక్ (భారత్)
కరిము స్వాఫీ (టాంజానియా)
నాథనియల్ టాన్ (సింగపూర్)

ట్విస్టింగ్ బాడీ – సీనియర్ A మహిళలు

బంగారు పతకం నబిల్లా సోల్ బరాజా (అర్జెంటీనా)
సిల్వర్ మెడల్ సీమా పవార్ (భారత్)
కాపర్ మెడల్ మిసాకి యోకోయామా (జపాన్)

ట్విస్టింగ్ బాడీ – సీనియర్ C మహిళలు

బంగారు పతకం కుడుముల వనజ (భారత్)
సిల్వర్ మెడల్ దుర్గా పంతా (నేపాల్)
కాపర్ మెడల్ మహువా మండల్ (ఒమన్)

ట్విస్టింగ్ బాడీ – సీనియర్ C పురుషులు

బంగారు పతకం ఇందర్‌జీత్ (భారత్)
సిల్వర్ మెడల్ దిమిత్రి వోల్కోవ్ (రష్యా)
నామరాజ్ ధుంగానా (నేపాల్)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>