Mobile Popup Ad
Mobile Popup Ad

హైవేపై కూలిన భారీ మర్రి చెట్టు : ట్రాఫిక్​ జామ్​

కలం, వెబ్​ డెస్క్​ : కరీంనగర్ – చొప్పదండి ప్రధాన రహదారిపై ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఎదురైంది. కొలిమికుంట (Kolimikunta) సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఒక పచ్చని భారీ మర్రిచెట్టు ఒక్కసారిగా విరిగి ప్రధాన రహదారికి అడ్డంగా పడిపోయింది. ఈ ప్రమాదం కారణంగా కరీంనగర్, చొప్పదండి, రాయపట్నం వైపు వెళ్లే స్టేట్ హైవేపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం పడిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయి, ఇరువైపులా కిలోమీటరుకు పైగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో రోడ్డుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించే పనులను వేగవంతం చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తూ, వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>