అసెంబ్లీ ముట్టడికి యత్నం.. తీవ్ర ఉద్రిక్తత!

కలం, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో కార్మికులు అసెంబ్లీ (Telangana Assembly) ముట్టడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులు ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకురావడంతో పోలీసులు అప్రమత్తమై బషీర్ బాగ్ స్టేడియం వద్దనే అడ్డుకున్నారు. అనంతరం, వారిని అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరిస్తున్న తమ ఉపాధిని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చెత్తను సేకరించే కాంట్రాక్టును రాంకీ సంస్థకు అప్పగించేలా కుట్ర జరుగుతోంని కార్మికులు ఆరోపించారు. అదే జరిగితే తాము ఉపాధి కోల్పోవాల్సి వస్తుందన్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను పాత పద్ధతిలోనే పని చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>