Mobile Popup Ad
Mobile Popup Ad

గ్యాస్ కొరత.. పెళ్లి టైమ్‌లో చేతులెత్తేసిన క్యాటరింగ్ టీమ్

కలం, వెబ్ డెస్క్ : గ్యాస్ కొరత ఇండియాలో ఏ స్థాయికి వెళ్లిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అనేక రంగాలను గ్యాస్ కొరత (Gas crisis) కుదిపేస్తోంది. హోటళ్లు, హాస్టళ్లు మూత పడుతున్నాయి. ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో జరుగుతున్న పెళ్లి వేడుకలను కూడా గ్యాస్ ఎఫెక్ట్ తాకుతోంది. తాజాగా ఓ జర్నలిస్ట్ గ్యాస్ ఎఫెక్ట్ (Gas crisis) తన ఫ్రెండ్ పెళ్లి వేడుకను గ్యాస్ కొరత ఎలా ఇబ్బంది పెడుతుందో ట్వీట్ చేసింది.

‘నా స్నేహితుడి పెళ్లి వచ్చే వారం జరుగుతోంది. పెళ్లి దగ్గరకు వచ్చిన టైమ్ లో క్యాటరింగ్ సంస్థ షాక్ ఇచ్చింది. గ్యాస్ కొరత ఉందని చెబుతూ.. పెళ్లి వేడుకకోసం గ్యాస్ అరేంజ్ చేయాలని ఒత్తిడి చేస్తోంది. గ్యాస్ అరేంజ్ చేస్తేనే తాము వంటలు చేయగలుగుతామని చేతులు ఎత్తేసింది. పెళ్లి ఏర్పాట్లలో చాలా బిజీగా ఉంటున్న నా ఫ్రెండ్ ఫ్యామిలీ మరింత ఒత్తిడిలో పడిపోయింది’ అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>