Mobile Popup Ad
Mobile Popup Ad

ఫ్రెంచ్ ఓపెన్‌లో ఉక్రెయిన్ స్టార్ చరిత్ర.. సెమీస్‌లో రష్యాతో ఢీ !

కలం, వెబ్ డెస్క్:  ఫ్రెంచ్ ఓపెన్‌(French Open)లో భావోద్వేగాల మధ్య భారీ సెమీస్ పోరు ఖరారైంది. ఉక్రెయిన్ స్టార్ మార్టా కోస్ట్యూక్ తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్‌కు చేరగా, ఇప్పుడు ఆమెకు రష్యా యువ సంచలనం మిర్రా ఆండ్రీవా సవాల్‌గా నిలిచింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో కోస్ట్యూక్ 6-3, 2-6, 6-2తో సహచర ఉక్రెయిన్ ప్లేయర్ ఎలినా స్విటోలినాను ఓడించింది. మరోవైపు ఆండ్రీవా 6-0, 6-3తో రొమేనియా వెటరన్ సోరానా సిర్‌స్టియాపై సులువుగా గెలిచి సెమీస్ చేరుకుంది.

టూర్‌లో ఆండ్రీవాపై కోస్ట్యూక్‌కు 2-0 ఆధిక్యం ఉంది. మాడ్రిడ్ ఫైనల్‌లో కూడా కోస్ట్యూక్‌దే విజయం. మ్యాచ్ తర్వాత కోస్ట్యూక్ రష్యా ఆటగాళ్లతో ఉక్రెయిన్ ప్లేయర్లు పాటిస్తున్న విధానానికి అనుగుణంగా హ్యాండ్‌షేక్ చేయలేదు. ఉక్రెయిన్‌లో మరో విషాద రాత్రి గడిచిందని, ముఖ్యంగా కీవ్‌లో ప్రాణనష్టం కలిచివేసిందని ఆమె తెలిపింది. స్విటోలినా కూడా మ్యాచ్‌ను ఉక్రెయిన్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు పేర్కొంది. ప్రతిరోజూ భయం, బాధ మధ్య జీవించడం ఎంత కష్టమో చెప్పింది.

ఇక తన కుమార్తెను చూసుకోవడానికి పారిస్ విడిచిపోతున్నా, కోస్ట్యూక్‌కు మద్దతుగా ఉంటానని వెల్లడించింది. ఈ విజయంతో కోస్ట్యూక్ 2026 క్లే కోర్ట్ సీజన్‌లో 17-0 రికార్డుతో కొనసాగుతోంది. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ చేరిన తొలి ఉక్రెయిన్ మహిళగా చరిత్ర సృష్టించింది. మరోవైపు ఆండ్రీవా రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌కు చేరింది. ప్రత్యర్థి ఎవరన్నది కంటే, తన దృష్టి మొత్తం ఆటపైనే ఉంటుందని ఆమె తెలిపింది. ఇప్పుడు కోస్ట్యూక్–ఆండ్రీవా సెమీఫైనల్ మ్యాచ్‌పై ఆసక్తి పెరిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>