దమ్మపేటలో గంజాయి, వేట సామగ్రి గుర్తింపు

కలం, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట (Dammapeta) మండల పరిధిలో గంజాయి కలకలం రేపింది. అంకంపాలెం (Ankampalem) గ్రామ పంచాయతీ పరిధిలోని కొడిశెలగూడెం గ్రామంలో ఓ వ్యక్తి ఇంట్లో గంజాయితో పాటు వేటకు ఉపయోగించే సామగ్రిని అటవీశాఖ అధికారులు శుక్రవారం గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. కొడిశెలగూడెం గ్రామానికి చెందిన పెనుబల్లి నాగులు నాటు తుపాకీతో అడవి జంతువులను వేటాడేందుకు వెళ్తున్నట్లు అటవీశాఖ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఎఫ్‌ఎస్‌ఓ భద్రయ్య తన సిబ్బందితో కలిసి నాగులు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. నాటు తుపాకీ కోసం వెతుకుతున్న సమయంలో ఇంట్లో అనుమానాస్పదంగా ప్యాక్ చేసి ఉంచిన రెండు ప్యాకెట్లు కనిపించాయి.

వాటిని పరిశీలించగా గంజాయిగా గుర్తించారు. అనంతరం ఇంట్లో మరింతగా తనిఖీలు చేయగా మరో ప్యాకెట్ కూడా లభించింది. దీంతో మొత్తం మూడు ప్యాకెట్లలో సుమారు ఐదు కిలోల వరకు గంజాయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఇంట్లో నాటు తుపాకీలో ఉపయోగించే 52 ఇనుప షెల్స్, 28 పెద్ద ఇనుప షెల్స్, వేటకు ఉపయోగించే హారన్, ఒక కత్తి, గన్‌పౌడర్ ఉన్న సీసా, టపాసులకు ఉపయోగించే పౌడర్ డబ్బాను అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>