పేదల సొంతింటి కలకు బీర్ల అయిలయ్య అండ

కలం, ఆలేరు: పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం రాయకుంటపల్లితో (Rayakuntapalli) పాటు యాదగిరిగుట్ట పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాయకుంటపల్లి గ్రామంలో లబ్ధిదారులు భువనగిరి మమత, మధు దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. యాదగిరిగుట్ట పట్టణంలోని 5వ వార్డుకు చెందిన సునీత దేవి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలోనూ పాల్గొన్నారు. నూతన గృహాల్లోకి అడుగుపెడుతున్న రెండు కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపి, పట్టుబట్టలు బహుకరించారు. అలాగే ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. నిరుపేదల సొంతింటి కల సాకారమై వారు కొత్త జీవితాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషకరమన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణం పూర్తయి గృహప్రవేశం చేసుకుంటున్న సమయంలో ఎమ్మెల్యే స్వయంగా ఆర్థిక సహాయం అందించడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>