కలం, గద్వాల: కొద్ది రోజులుగా ఉక్కపోత, వేడి వాతావరణంతో ఇబ్బందులు పడుతున్న జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) ప్రజలకు ఉపశమనం లభించింది. గద్వాలలో శుక్రవారం వాతారణం ఒక్కసారిగా మారిపోయింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షం (Heavy Rain) కురిసింది. ఈదురుగాలులు గద్వాల పట్టణంలో బీభత్సాన్ని సృష్టించాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఎంతో ఉపశమనం పొందారు. వర్షం తీవ్రతకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

