కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బుర్గంపాడు (Burgampadu) కమ్యూనిటీ హెల్త్ సెంటర్(CHC) చరిత్రలో డాక్టర్లు మొదటిసారి సీజేరియన్ చేశారు. జిల్లాలోని సారపాకకి చెందిన బానోత్ మమత రెండో కాన్పు ప్రసవం కోసం బుర్గంపాడు ప్రభుత్వాస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. వైద్యురాలు అనూష లక్ష్మీ శనివారం డెలీవరి (Delivery) చేశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.
గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న ఆసుపత్రిని 2022లో వైద్య విధాన పరిషత్ ద్వారా 30 పడకల ఆసుపత్రిగా మార్చారు. 30 పడకలకు సరిపడా భవనం, మౌలిక సదుపాయాలు మంజూరు కాలేదు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఆసుపత్రికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చారు. అన్ని వసతులు ఉండటంతో రోగుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో మొట్టమొదటి ఆపరేషన్ జరగడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


