Mobile Popup Ad
Mobile Popup Ad

జైలు జీవితం ఎక్స్‌పీరియెన్స్ చేస్తారా.. ఇదే ఛాన్స్!

క‌లం, వెబ్‌డెస్క్‌: కొన్ని అనుభ‌వాలు సినిమాల్లో చూడ‌టం.. ఎవ‌రో ఒక‌రు చెప్తే విన‌డం త‌ప్ప ఎలా ఉంటాయో ఎవ్వ‌రికీ తెలియ‌దు. అలాంటిదే జైలు జీవితం కూడా. అస‌లు జైలులో ఖైదీల రోటీన్ ఎలా ఉంటుంది? వాళ్ల‌ను కొట్టి చిత్ర‌హింస‌ల‌కు గురి చేస్తారా? లేక బాధ‌తో గ‌డుపుతుంటారా? సినిమాల్లో చూపించిన‌ట్లు ప‌నులు ఏమైనా చేస్తారా? ఇవ‌న్నీ తెలుసుకోవాల‌ని అంద‌రికీ ఉంటుంది. కానీ, జైలుకు వెళ్లాల‌ని ఎవ‌రైనా అనుకుంటారా? అందుకే నేరం చేయకుండానే జైలు జీవితం ఎలా ఉంటుందో అనుభవించాలనుకునే వారి కోసం తెలంగాణ జైళ్ల శాఖ ఒక వినూత్న అవకాశాన్ని కల్పిస్తోంది. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు (Chanchalguda Jail) ప్రాంగణంలో ఫీల్ ది జైల్ (Feel the Jail) పేరుతో ఒక రోజు జైలు అనుభవాన్ని (Jail experience) సామాన్యులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం జైలు ఆవరణలోని స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్ (SICA) వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడమే కాకుండా, అక్కడే ఒక జైలు మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జైలుకు వచ్చే సందర్శకులకు ఖైదీలకు ఇచ్చే దుస్తులు, భోజనం, ఇతర వసతులను అందిస్తారు. వారు నిర్దేశించిన సమయం పాటు జైలు గదిలోనే గడపాల్సి ఉంటుంది. నేర చరిత్ర, జైళ్ల పరిణామ క్రమం, పురాతన జైలు విశేషాలను తెలిపేలా మ్యూజియాన్ని కూడా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే సంగారెడ్డి పాత జైలులో అమలవుతున్న ఈ విధానం పట్ల ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో, ఇప్పుడు నగరవాసులకు అందుబాటులో ఉండేలా చంచల్‌గూడలోనూ దీన్ని ప్రారంభిస్తున్నారు. ఏప్రిల్ 28 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఇంకేం మీరు కూడా జైలు జీవితం ఎలా ఉంటుందో ఓసారి వెళ్లి చూసేయండి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>