కలం, వెబ్ డెస్క్: బెంగళూరు (Bengaluru)లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను కన్న తండ్రే దారుణంగా గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇమ్రాన్ (40) అనే వ్యక్తి సోమవారం సాయంత్రం ఎయిర్పోర్ట్ సమీపంలోని ఓ హోటల్లో తన ఇద్దరు చిన్నారులతో కలిసి రూం అద్దెకు తీసుకున్నాడు. హోటల్ సిబ్బంది ఎంత తలుపు కొట్టినా డోర్ తీయలేదు. అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా.. అయిదు, పదేళ్ల వయస్సున్న ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడి ఉన్నారు.
వారి పక్కనే ఇమ్రాన్ ఆత్మహత్యాయత్నం చేయబోతుండగా.. సిబ్బంది అడ్డుకుని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. గదిలో ఒక లేఖ లభించింది. కుటుంబ సమస్యల కారణంగానే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు అందులో పేర్కొన్నారు. సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డీసీపీ మిథున్ కుమార్ వెల్లడించారు. ఇద్దరి మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వివరించారు.

