జూనియర్ న్యాయవాది ఐశ్వర్య మృతిపై న్యాయ విద్యార్థుల నిరసన

కలం, మహబూబ్ నగర్ బ్యూరో :  జూనియర్ న్యాయవాది ఐశ్వర్య మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాలమూరు యూనివర్సిటీ న్యాయ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం పాలమూర్ యూనివర్సిటీ లా కళాశాల నుండి ర్యాలీగా వచ్చి యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర నిరసన (Law Students Protest) తెలిపారు. ఐశ్వర్య మృతికి కారణమైన మెడికవర్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని లా స్టూడెంట్ ఫోరం విద్యార్థులు డిమాండ్ చేశారు.

ఎంతో భవిష్యత్తు ఉన్న ఐశ్వర్య ఈ విధంగా మరణించడం బాధాకరమన్నారు. అన్యాయంగా ఐశ్వర్య మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లా స్టూడెంట్ ఫోరమ్ ప్రతినిధులు వెంకటేష్, శివ, విజయ్, ప్రశాంత్,   శివారెడ్డి, లా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>