రవాణా శాఖ మంత్రి ఇలాకాలో ప్రమాదం.. కుప్పకూలిన బస్టాండ్ సీలింగ్!

కలం, మెదక్ బ్యూరో : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో (Husnabad Bus Stand) ప్రమాదం చోటుచేసుకుంది. బస్టాండ్ ఆవరణలోని ఫాల్ సీలింగ్ కప్పు ఒక్కసారిగా ఊడి కిందపడింది. ఈ ఘటన రాత్రి సమయంలో జరగడంతో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, అంతా ఊపిరి పీల్చుకున్నారని స్థానికులు తెలిపారు.

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బస్టాండ్ పైకప్పు లీకై నీరు చేరింది. దీంతో సీలింగ్ షీట్లు పూర్తిగా తడిసి బరువుగా మారి రాత్రి వేళలో ఊడిపడ్డాయి. ఉదయం పూట లేదా ప్రయాణికుల రద్దీ ఉన్న సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే భారీగా నష్టం జరిగి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ. 2 కోట్ల నిధులతో కేవలం ఏడాదిన్నర క్రితమే ఈ బస్టాండ్ ఆధునీకరణ పనులు పూర్తి చేశారు. అయితే తాజాగా బస్టాండ్ ఆవరణలోని ఫాల్ సీలింగ్ కూలిపోవడంపై కాంట్రాక్టర్లు, అధికారుల పర్యవేక్షణ లోపం తేటతెల్లమవుతోందని స్థానికులు మండిపడుతున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>