ఐదు ఓటముల తర్వాత ద్రవిడ్ టీమ్‌కు బిగ్ విక్టరీ!

కలం, స్పోర్ట్స్ : ఐదు మ్యాచ్‌లు.. ఐదు ఓటములు. ఇక డబ్లిన్ గార్డియన్స్‌ (Dublin Guardians) కు ఎట్టకేలకు బోణీ పడింది. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో బెల్‌ఫాస్ట్ వోల్వ్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో డబ్లిన్ జట్టుకు కాస్త ఊరట లభించింది. అంతకుముందు వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ సమయంలో జట్టు యాజమాని రాహుల్ ద్రవిడ్ మాత్రం ఆటగాళ్లకు మద్దతుగా నిలిచాడని కోచ్ విక్రమ్ రాథోర్ తెలిపాడు.

జట్టు కష్టాల్లో ఉన్నా ద్రవిడ్ జట్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని రాథోర్ చెప్పాడు. కోచ్‌గా ఉన్న అనుభవంతో పరిస్థితిని అర్థం చేసుకుని జట్టుకు అండగా నిలిచాడని వివరించాడు. కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ కూడా జట్టు క్రికెట్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ప్రత్యర్థులు, ఆటగాళ్లపై అతడికి ఉన్న పరిజ్ఞానం జట్టుకు ఉపయోగపడుతోందని రాథోర్ తెలిపాడు. ఇక డబ్లిన్ గార్డియన్స్‌కు ఇవాళ మరో కీలక పోరు ఉంది. ఎడిన్‌బర్గ్ క్యాసిల్ రాకర్స్‌తో మ్యాచ్ జరగనుంది. ఐదు ఓటముల తర్వాత వచ్చిన తొలి విజయాన్ని కొనసాగించాలని డబ్లిన్ చూస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>