Mobile Popup Ad
Mobile Popup Ad

‘షూటర్’ ఫోటోను విడుదల చేసిన ట్రంప్.. అతని నేపథ్యం ఇదే..!

కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పాల్గొన్న వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేడుకలో కాల్పుల ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది. కాల్పులు శబ్ధం విన్న వెంటనే భద్రతా బలగాలు ట్రంప్ ను వేదికపై నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. బయట భద్రతా చెక్ పాయింట్ వద్ద కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితుడి ఫోటోను ట్రంప్ తన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’లో పంచుకున్నారు. ఇందులో నిందితుడు చొక్కా లేకుండా.. చేతులు వెనుకకు కట్టేసి, నేలపై పడి ఉండటం గమనార్హం.

నిందితుడిని కాలిఫోర్నియాకు చెందిన కోల్‌ అలెన్‌గా గుర్తించారు. అయితే ఈ కాల్పుల వెనుక నిందితుడి ఉద్దేశం ఎంటో ఇంకా తెలియరాలేదు. నిందితుడికి సంబంధించిన పాత నేర చరిత్ర వివరాల తెలుసుకుంటున్నట్లు మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తాత్కాలిక చీఫ్ జెఫ్రీ కారోల్‌ అన్నారు కాగా, నిందితుడు టీచర్ గా పనిచేస్తున్నాడని, టీచర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు కూడా అతడు తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>