కలం, వెబ్ డెస్క్: తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే విజయ్ (TVK Vijay)కి విడాకుల వ్యవహారం తలనొప్పిగా మారింది. గత నెలలో విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నేడు చెంగల్పట్టు కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. కోర్టు ఈ కేసు తీర్పును జూన్ 15కు వాయిదా వేసింది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని గతంలోనే కోర్టు విజయ్‌కి నోటీసులు జారీ చేసింది. సంగీత వేసిన కేసులో విజయ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. విజయ్‌కి 2020 నుంచే ఒక నటితో సంబంధం ఉందని, అప్పటి నుంచి తనను దూరం పెడుతున్నాడని పేర్కొంది. ఇక అప్పటికే నటి త్రిషతో విజయ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని వస్తున్న వార్తలకు సంగీత ఫిర్యాదు మరింత బలం చేకూర్చింది. ఇక ఏప్రిల్ 23న తమిళనాడు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విడాకుల వ్యవహారం విజయ్‌కి ప్రతికూలంగా మారుతుందన్న చర్చ నడుస్తోంది.

