Mobile Popup Ad
Mobile Popup Ad

ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. టోర్నీ నుంచి డకెట్ ఔట్!

కలం, వెబ్ డెస్క్:  ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals) జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్ (Ben Duckett) ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం జట్టుకు గట్టి ఎదురుదెబ్బగా మారింది.

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డకెట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌పై పూర్తి దృష్టి పెట్టాలని భావిస్తున్నానని, శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండటమే తన ప్రాధాన్యత అని తెలిపాడు. ఈ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీకి, అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ జట్టు రూ. 2 కోట్లు పెట్టి డకెట్‌ను కొనుగోలు చేసింది. ఓపెనింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాడని ఆశించినప్పటికీ, ఆయన తప్పుకోవడంతో జట్టు బ్యాలెన్స్ దెబ్బతింది. ఇప్పుడు ఆయన స్థానంలో మరో విదేశీ ప్లేయర్ కోసం జట్టు వెతుకుతోంది.

బీసీసీఐ (BCCI) తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం.. వేలంలో అమ్ముడయిన ఏ విదేశీ ప్లేయర్ అయినా, సరైన మెడికల్ కారణం లేకుండా టోర్నీకి ముందే తప్పుకుంటే వారిపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తారు. ఈ లెక్కన బెన్ డకెట్ మీద యాక్షన్ తీసుకుంటే, ఆయన 2027, 2028 ఐపీఎల్ వేలంలో కూడా పాల్గొనే ఛాన్స్ ఉండదు. మళ్లీ 2029 సీజన్‌లోనే ఆయన ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వగలరు. గతంలో హ్యారీ బ్రూక్ (Harry Brook) కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్‌లో కూడా డకెట్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. కీలక సమయంలో డకెట్ తప్పుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ మేనేజ్‌మెంట్‌కు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడు సరైన రీప్లేస్‌మెంట్‌ను ఎంపిక చేయడం జట్టుకు కీలకం అయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>