జీవో 97ను రద్దు చేయాలి: దాస్యం వినయ్‌ భాస్కర్‌

కలం, హనుమకొండ: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్న జీవో నంబర్‌ 97ను రద్దు చేయాలని మాజీ చీఫ్‌ విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ (Dasyam Vinay Bhaskar) డిమాండ్‌ చేశారు.

బాలసముద్రంలోని ఏకశిలా పార్క్‌ వద్ద డీఎస్‌ఏ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. నిధులు విడుదల కాక విద్యార్థులు, తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల హక్కుల కోసం చేపట్టే పోరాటాలకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>