కలం, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కొత్త సినిమాలతో పాటు రీ రిలీజ్‌లతో కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. 2010లో వచ్చిన ఫీల్ గుడ్ మూవీ డార్లింగ్ (Darling) ఇటీవల రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్గా రూ.10.44 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి అందరినీ షాకయ్యేలా చేసింది. గతంలో ప్రభాస్ సినిమాల్లో సలార్ రీరిలీజ్ అయ్యింది. ఆ సినిమా రూ.4.35 కోట్లు రాబట్టింది. ఈ రికార్డు డార్లింగ్ బ్రేక్ చేసింది. ఈ కలెక్షన్లతో ప్రభాస్ మరోకొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అత్యధిక వసూళ్లు సాధించిన రీరిలీజ్ సినిమాగా రెండో స్థానంలో ఉన్న మహేశ్ బాబు ఖలేజా సినిమాను సైడ్‌కి నెట్టేశాడు. ఇక ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో బాహుబలి ఉంది. మరోవైపు సౌత్ మొత్తంలో రీ రిలీజ్ జాబితాలో డార్లింగ్ ఆరో స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో ఈ మూవీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేలాగా కనిపిస్తోంది.

