Mobile Popup Ad
Mobile Popup Ad

సామాజిక తెలంగాణ దిశగా పాలక ప్రభుత్వం పనిచేయాలి: సీపీఐ

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో సీపీఐ పాత్ర మరువలేనిదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. అయితే ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదని ఆరోపించారు. ఈ పాలక ప్రభుత్వమైనా సామాజిక తెలంగాణ దిశగా, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పరిపాలన సాగాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం గణేష్ నగర్ లో గల సీపీఐ జిల్లా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను పంజాల శ్రీనివాస్ ఎగురవేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను గుర్తించిన సీపీఐ జాతీయ సమితి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిందని చెప్పారు. ఒకే పార్టీ, ఒకే నినాదంతో దేశవ్యాప్తంగా సీపీఐ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై అనేక ఉద్యమాలు, పోరు బాటలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. శ్రీకృష్ణ కమిటీ కి గాని, ఇతర కమిటీలకు గాని తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను వివరించిన పార్టీ సీపీఐ అని అన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో రాష్ట్ర కోసం జరిగిన పోరాటంలో ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుండి రాష్ట్రం కోసం పోరాటం నిర్వహిస్తే, అందులో సీపీఐ కూడా ఏమాత్రం తగ్గకుండా పోరాటాల్లో భాగస్వామ్యం అయ్యిందని.. మిలియన్ మార్చ్, ధూం ధాం, సాగర హారం లాంటి అనేక కీలక కార్యక్రమాల్లో సిపిఐ ప్రత్యక్షంగా పాల్గొన్నదని గుర్తు చేశారు. 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, ఆవిర్భవించిన అనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారని, ఉద్యమ నాయకుడు కేసీఆర్ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందారని తెలియజేశారు.

దీంతో గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని.. భూమిలేని నిరుపేదలకు భూములు ఇవ్వాలని, అర్హులైన పేదలకు, పెన్షన్లు, ఇండ్లు లేని వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, ప్రధానంగా ఉద్యమ సమయంలో అనేక కేసుల పాలు జైలు పాలైన ఉద్యమకారులను గుర్తించి వారికి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను అమలు పరచడంలో వివక్షత చూపుతోందని, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేయడానికి పూనుకుంటుందని, రాష్ట్రాల హక్కులను హరిస్తు వివక్షత చూపడం సరైనది కాదన్నారు. ఇదే విధమైన పరిపాలన సాగిస్తే తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు ఉండవని పంజాల శ్రీనివాస్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బీర్ల పద్మ,కొట్టె అంజలి, బూడిద సదాశివ,నాయకులు బాకం ఆంజనేయులు,గామినేని సత్యం,చెంచల మురళి,నగునూరి రమేష్,కసిబోజుల సంతోష్ చారి,నర్సింహులు,నిఖిల్ సాయి,సాంబయ్య,అశోక్,రామన్న తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>