మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు : ఎంపీ చామల

కలం, నల్లగొండ బ్యూరో: మహిళా రిజర్వేషన్ల అంశంపై బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) మహిళా లోకానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ పార్టీ గానీ, ఇండియా కూటమి గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని, అయితే దానిని వెంటనే అమలు చేయకుండా డీలిమిటేషన్ పేరుతో బీజేపీ కాలయాపన చేస్తోందని విమర్శించారు. నియోజకవర్గాల విభజనను అడ్డం పెట్టుకుని శాశ్వతంగా అధికారంలో ఉండాలనే కుట్రతోనే బీజేపీ ముందుకు వెళ్తోందని, అందుకే తాము డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.

తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడం కోసమే ప్రధాని మోదీ హడావుడిగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించారని ఆరోపించారు. 2024 లోనే మహిళా రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. డీలిమిటేషన్ ప్రక్రియలో ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి మధ్య ఎలాంటి అంతరం లేకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి అనుసరించిన ప్రజాస్వామ్య విధానాలనే ఇప్పుడు కూడా అమలు చేయాలని సూచించారు. డీలిమిటేషన్ చేయాలంటే అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. గతంలో ఎస్.ఐ.ఆర్ పేరుతో తమకు నచ్చినట్లుగా ఓట్లను ఏ విధంగా తొలగించారో.. ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా కూడా అదే విధంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>