దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్ : దేవీ నవరాత్రి ఉత్సవాలను (Navaratri Celebrations) పురస్కరించుకుని ఆదిలాబాద్‌ రూరల్ మండలం రాంపూర్‌ గ్రామంలో భువనేశ్వరి వేద జ్యోతిష విద్యాపీఠం ఆధ్వర్యంలో శ్రీ దుర్గామాత ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా (Collector Rajarshi Shah) సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

ఆలయంలో నిర్వహించిన హోమం, ప్రత్యేక పూజల్లో కలెక్టర్‌ పాల్గొని వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కలెక్టర్‌ రాజర్షి షా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు స్వీకరించగా, వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలు  గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. పంటలు సమృద్ధిగా పండి రైతులు సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>