కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు ఆందోళనలు ఆపబోమని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే (Abhijeet Dipke) స్పష్టం చేశారు. ‘సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఇతర నాయకులు కూడా వివిధ ప్రాంతాల్లో నిర్బంధంలో ఉన్నారు. మేం మళ్లీ ఒక చోట సమావేశం అయ్యాక భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకుంటాం. తమను బలవంతంగా అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి లెక్కచేయబోం. న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిరసనల కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం’ అన్నారు.
ఢిల్లీలో ఇక కష్టమే..?
కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ప్రధానంగా ఢిల్లీ కేంద్రంగా జరిగాయి. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా కోసం జంతర్ మంతర్ వద్ద నెలల తరబడి చేసిన పోరాటాలు ఫలించి, ఆయన తప్పుకున్నారు. జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా కోరుతూ ఇప్పుడు మొదలైన ఆందోళనలపై మాత్రం కేంద్రం కఠిన వైఖరి అవలంబిస్తోంది. జంతర్ మంతర్ను ఆందోళనల ప్రాంతం నుంచి డీ నోటిఫై చేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ప్రత్యామ్నాయంగా మరో మూడు వేదికలు సూచించింది. అక్కడ నిరంతరం రకరకాల సభలు జరుగుతుండటంతో ఇక నుంచి ఢిల్లీలో ఆందోళనలు చేయడం కష్టమేనన్న అభిప్రాయం నెలకొంది. రాబోయే రోజుల్లో సీజేపీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : నీరు వృథా.. పబ్కు భారీ జరిమానా
Follow Us On: Youtube

