కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపటి నుంచి రెండు రోజులపాటు కొడంగల్ (Kodangal) నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రేపు సాయంత్రం 4 గంటలకు దుద్యాల్ మండలం, హకీంపేట గ్రామంలో నిర్మిస్తున్న ‘ఎడ్యుకేషన్ హబ్’ పనులను సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు కొడంగల్ నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమీక్ష ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేపు రాత్రి కొడంగల్లోనే బస చేస్తారు. పర్యటనలో భాగంగా రెండవ రోజు ఉదయం 10 గంటలకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లతో సమగ్ర ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ యంత్రాంగం, స్థానిక నాయకులకు సర్ ప్రక్రియపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తిరిగి హైదరాబాద్కు బయలుదేరనున్నారు.
Read Also: రాహుల్ గాంధీపై మోదీ సెటైర్లు.. 56 ఏళ్ల యువకుడు అంటూ..
Follow Us On : WhatsApp

