పంచాయతీ కార్మికులకు రూ.42 వేల కనీస వేతనం చెల్లించాలి: CITU

కలం, సోన్: గ్రామ పంచాయతీ కార్మికులకు (Gram Panchayat Workers) నెలకు కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలని, ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 6ను అమలు చేయాలని సీఐటీయూ (CITU) నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. సోన్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (CITU) మండల స్థాయి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. కార్మికులపై పనిభారం పెంచుతున్న మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నంబర్ 51ను ఉపసంహరించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ.2 లక్షలు చెల్లించడంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం సోన్ మండల యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా రాజదాస్, కోశాధికారిగా ఎల్లయ్య, ఉపాధ్యక్షులుగా నర్సయ్య, లింగం, పోశెట్టి, సహాయ కార్యదర్శులుగా గంగన్న, విజయ్, పొలాస ముత్తన్న ఎన్నికయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>