హనుమకొండలో చాకలి ఐలమ్మ వర్ధంతి

కలం, హనుమకొండ: వీరనారి చాకలి ఐలమ్మ (Chakali Ilamma) పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్‌భాస్కర్ అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా న్యూ శాయంపేట జంక్షన్‌లోని ఆమె విగ్రహానికి సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయి, డాక్టర్ సత్యశారద పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.. రైతులు, పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. మహిళా సాధికారత, సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బాలసముద్రంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలోనూ ఐలమ్మ చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. పులి రజనీకాంత్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విజయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఐలమ్మ చూపిన తెగువ తెలంగాణ రైతాంగ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. ఆమె ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయ పోరాటాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>