కలం, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో (Mahabubabad Area Hospital) తృటిలో ప్రమాదం తప్పింది. పీడియాట్రిక్ వార్డులో సీలింగ్ ఒక్కసారిగా కిందపడింది. ఆ సమయంలో వార్డులో పిల్లలు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సీలింగ్ కూలిన ఘటనపై వైద్యులు విచారణ చేపట్టారు. సీలింగ్ చిన్నారులకు వైద్య సేవలు అందించే వార్డులో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆస్పత్రి భవనం నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

