కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని మారెమ్మ టెంపుల్, శాంతినగర్ 11 కేవీ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం (Electricity Shutdown) ఉంటుందని ఏడీఈ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వినాయకనగర్, శాంతినగర్, శ్రీనగర్ కాలనీ, జర్నలిస్టు కాలనీ, విద్యానగర్, శివాజీ చౌక్, గాయత్రీ టౌన్‌షిప్, వెంకటాపూర్, ఏటీఆర్ స్మార్ట్ సిటీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి, విద్యుత్ శాఖకు సహకరించాలని ఏడీఈ శ్రీనివాసరావు కోరారు.

