పంట నష్టంపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పరిశీలన

కలం, వనపర్తి: విద్యుత్‌ కోతల కారణంగా సాగునీరు అందక పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో సుమారు 200 ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) అన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం ఆయన గ్రామానికి వెళ్లి రైతులతో కలిసి ఎండిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. నీటి లభ్యత ఉన్నప్పటికీ విద్యుత్‌ కోతలతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. బుద్దారం రిజర్వాయర్‌ లెఫ్ట్‌ కెనాల్‌ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందించడంతోపాటు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని కోరారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీరు అందిస్తే మిగిలిన పంటలను కాపాడుకోవచ్చని, భూగర్భ జలాలు పెరిగి యాసంగి పంటలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. పశువులకు తాగునీటి సమస్య కూడా తగ్గుతుందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తమ పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట జగదీశ్వర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, సర్పంచ్‌ రాజవర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>