ఫ్యూచర్ సిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. హై టెన్షన్!

కలం, వెబ్ డెస్క్: ఫ్యూచర్ సిటీలో హై టెన్షన్ నెలకొంది. కేటీఆర్, హరీశ్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి కంపెనీకి కేటాయించిన భూములను పరిశీలించేందుకు వెళ్లారు. తుక్కుగూడలో కొండల్ రెడ్డి కంపెనీ టెస్సరాక్ట్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూములను కేవలం రూ.7 కోట్లకే ప్రభుత్వం కట్టబెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రభుత్వ భూములను తన కుటుంబానికి కేటాయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారీగా పోలీసుల మోహరింపు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫ్యూచర్ సిటీ భూముల వద్దకు వస్తుండటంతో భారీగా పోలీసులను మోహరించారు. అప్పటికే అక్కడకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఏం జరుగుతుందోనని హై టెన్షన్ నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>