నేడు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

కలం, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా పి. గన్నవరం నియోకవర్గంలో నిర్వహించే గ్రామసభలో పాల్గొనున్న సీఎం.. లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు రైతులతో ముఖాముఖి, గ్రామసభ, పార్టీ కేడర్‌తో సమావేశం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

షెడ్యూల్ ప్రకారం.. సీఎం చంద్రబాబు ఉదయం 10:30 గంటలకు అంబాజీపేట మండలం ఇరుసుమండ చేరుకుని అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం అవుతారు. ఉ. 10:55 గంటలకు జయంతి నగర్‌లో ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి పండువారిపేటలోని గ్రామసభ వేదికకు చేరుకుని మధ్యాహ్నం 1:55 గంటల వరకు ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా కోనసీమ జిల్లాలో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని గ్రౌండ్ రెంట్ భూముల సమస్యకు విముక్తి కలగనుంది. పాత రెవెన్యూ రికార్డుల కారణంగా రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A నిషేధిత జాబితా లో ఉన్న భూములపై క్రయవిక్రయాలు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న 1,416 కుటుంబాలకు సీఎం చంద్రబాబు పర్యటన ద్వారా లబ్ది చేకూరనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>