సమస్యలు పక్కదారి పట్టించేందుకే ఏలేటిపై విమర్శలు

క‌లం, నిర్మ‌ల్‌: నిర్మల్ (Nirmal) పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy)పై వైస్ చైర్మన్ విమర్శలు చేశారని బీజేపీ( BJP) నాయకులు ఆరోపించారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో బీజేపీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

మున్సిపల్ కమిషనర్, డీఈతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించే హక్కు ఎమ్మెల్యేకు లేదని చెప్పడం సరికాదన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్లను మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. మీ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే మాట్లాడి నిర్మల్ పట్టణ అభివృద్ధి కోసం రూ.15 కోట్ల నిధులు తీసుకువస్తే, వాటి టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లు నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకే మైనార్టీ వార్డులకు అధిక నిధులు కేటాయించారని ఆరోపించారు. గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీలో విలీనమైన మంజులాపూర్‌లోని రెండు వార్డులకు తక్కువ నిధులు కేటాయించి వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. పట్టణంలోని 42 వార్డులకు సమానంగా నిధులు కేటాయించి సమగ్ర అభివృద్ధి చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజీ నరేష్, కూన శశాంక్, రావుల వార్ విఠల్, సూరజ్ నాయక్, జింక సూరి, నాయకులు రావుల రాంనాథ్ సాదం అరవింద్, అయిండ్ల సాత్విక్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>