నిర్మల్‌లో భక్తిశ్రద్ధలతో సామూహిక గిరిప్రదక్షిణ

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గిరి నందిగుండం దుర్గామాత ఆలయంలో ( Srigiri Nandigundam Temple) దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు సరస్వతీ మాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటాచారి నేతృత్వంలో వేలాది మంది భవానీ దీక్షాధారులు సామూహిక గిరిప్రదక్షిణ (Giri pradakshina) నిర్వహించారు. అమ్మవారి నామస్మరణ చేస్తూ భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>