అమెరికా స్కూల్‌లో దారుణం: కాల్పుల్లో నలుగురు మృతి!

కలం, వెబ్ డెస్క్ : అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఉన్న బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్‌లో కాల్పుల ఘటన (Oregon Shooting) దిగ్భ్రాంతిని కలిగించింది. తుపాకీతో లోపలికి ప్రవేశించిన 16 ఏళ్ల బాలుడు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 5, 8, 11 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు పిల్లలతో పాటు ఒక ఉపాధ్యాయుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో 7 ఏళ్ల చిన్నారి, 54 ఏళ్ల ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పాఠశాల తలుపులను కాల్చుకుంటూ లోపలికి వచ్చిన నిందితుడిని, లైసెన్స్ ఉన్న తుపాకీని కలిగి ఉన్న ఒక స్థానిక పౌరుడు ధైర్యంతో అడ్డుకుని కాల్చిచంపడంతో మరింత ఘోరం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎఫ్‌బీఐ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు వేగవంతం చేశాయి. దాడులకు గల కారణాలు మరియు నిందితుడికి ఆ పాఠశాలతో ఉన్న సంబంధంపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>