కలం, నిర్మల్: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచి, నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న (DEO Darshanam Bhojanna) సూచించారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని నారాయణ హైస్కూల్లో ఎఫ్ఎల్ఎన్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎల్ఎన్ కాంపిటెంట్ పాఠశాలల్లో 2027 మార్చి నాటికి 80 శాతం మంది విద్యార్థులు నిర్దేశిత అభ్యసన సామర్థ్యాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సపోర్టివ్ మానిటరింగ్‌లో భాగంగా అత్యధిక పాఠశాలలను సందర్శించిన భైంసా మండల విద్యాశాఖ అధికారి సుభాష్‌తో పాటు పలువురు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశీలకులు శ్యామ్ రాథోడ్, జిల్లా సమన్వయకర్త నర్సయ్య, మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ప్యానల్ ఇన్స్పెక్షన్ సభ్యులు పాల్గొన్నారు.

