కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ మారుతి నగర్ స్నేహా సొసైటీ (Sneha Society) ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ టార్గెట్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్ దివ్యాంగుల పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలను (Bathukamma Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహా సొసైటీ అందుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, స్నేహా టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ సిబ్బంది, దివ్యాంగుల పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి, కుంకుమ, పసుపుతో గౌరమ్మను తయారు చేసి సంబరాలను వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా నిర్వాహకులు సిద్ధయ్య, జ్యోతి, సిబ్బంది మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ అని, ఇది మహిళలంతా భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ అని అన్నారు.
ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. అయితే గతంలో బతుకమ్మ పండుగను ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరుపుకున్నప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రత్యేకంగా రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహా టీ ఐ ప్రాజెక్ట్ సిబ్బంది, అంధుల ప్రత్యేక పాఠశాల సిబ్బంది, మానసిక వికలాంగుల పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Also Read : కోహ్లీకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ.. ఏబీ షాకింగ్ కామెంట్స్
Follow Us On: X(Twitter)

